Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొరాకోతో 0-0తో నిరాశ
అల్ఖోర్ (ఖతార్) : 2018 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ క్రోయేషియా.. 2022 ఫిఫా ప్రపంచకప్ వేటను గోల్ లేని డ్రాతో మొదలుపెట్టింది. బుధవారం ఆల్ బయత్ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో మొరాకా, క్రోయేషియాలు గోల్స్ నమోదు చేయటంలో తేలిపోయాయి. 0-0తో మ్యాచ్ డ్రా ముగియగా, ఇరు జట్లు పాయింట్లు పంచుకున్నాయి. క్రోయేషియా తరఫున గత ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన ఆటగాళ్లలో నలుగురే మొరాకాతో మ్యాచ్‌లో బరిలోకి దిగారు. పస లేని దూకుడుతో క్రోయేషియా గోల్ అవకాశాలు సృష్టించుకోలేదు. మొరాకాతో ఆకట్టుకునేలా మెరిసినా.. గోల్ చేసేలా ఏ దశలోనూ కనిపించలేదు. ఇరు జట్లు రెండు సార్లు గోల్‌కు దగ్గరగా చేరువయ్యాయి. ప్రథమార్థం అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ వేటలో దూకుడు చూపించాయి. కానీ ఏవరూ గోల్ సాధించలేదు. ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న క్రోయేషియా.. బంతిని నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ అవకాశాలను సృష్టించుకోలేదు. గత మూడేండ్లలో 40 మ్యాచుల్లో మూడే మ్యాచుల్లో పరాజయం చవిచూసిన మొరాకో.. ప్రపంచకప్‌లోనూ డిఫెన్స్ సత్తా చాటుకుంది. 2018 ఫిఫా ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే గోల్ లేని డ్రాగా ముగియగా.. తాజా ఫిఫా ప్రపంచకప్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు గోల్ నమోదు కాకుండా డ్రాగా ముగియటం గమనార్హం. గ్రూప్-ఎఫ్ తర్వాతి మ్యాచుల్లో కెనడాతో క్రోయేషియా.. బెల్జియంతో మొరాకో తలపడనున్నాయి.