Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల టి20 ట్రోఫీ ఛాలెంజర్స్
రాయ్పూర్: మహిళల టి20 ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా-బి జట్టు విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇండియా-బి 4వికెట్ల తేడాతో ఇండియా-సిపై గెలిచింది. తొలిగా బ్యాటింగ్కు పూజా వస్త్రాకర్ సారథ్యంలోని ఇండియా-సి జట్టు 20 ఓవర్లలో 6వికెట్లు నష్టపోయి 140పరుగులు చేసింది. ఓపెనర్లు మేఘన(26), ప్రియ పూనియా(27) తొలి వికెట్కు 9 ఓవర్లలో 52పరుగులు జతచేశారు. ఆ తర్వాత కెప్టెన్ పూజ(27), సిమ్రన్()32) రాణించారు. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డికి మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇండియా-బి మహిళలు 19.5ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసి గెలిచారు. టాపార్డర్ బ్యాటర్స్ షెఫాలీ(7), గుజ్జర్(17), అరుంధతి రెడ్డి(0) నిరాశపరిచినా.. కెప్టెన్ దీప్తి శర్మ(26), హుమయిరా(20)కి తోడు దేవిక వైద్యా(41నాటౌట్; 27బంతుల్లో 4ఫోర్లు), నిషూ చౌదరి(24; 15బంతుల్లో 4ఫోర్లు) బ్యాటింగ్లో మెరిసారు. నేటితో లీగ్ మ్యాచ్లు ముగియగా.. శనివారం జరిగే ఫైనల్లో ఇండియా-డి జట్టు ఇండియా-ఏతో టైటిల్కై తలపడనుంది. ఇండియా-డి జట్టుకు శుష్మా రాణా, ఇండియా-ఏ జట్టుకు పూనమ్ యాదవ్ కెప్టెన్లు.