Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల్దీప్, షాబాజ్ అహ్మద్ లకు చోటు
ముంబయి: బంగ్లాదేశ్ టూర్లో భాగంగా టీమిండియాలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం కారణంగా రవీంద్ర జడేజా, యష్ దయాల్ ఈ పర్యటనకు దూరమయ్యారు. వారి స్థానంలో పేసర్ కుల్దీప్ సేన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌లు చోటు దక్కించుకున్నారు.
ఈ పర్యటన డిసెంబర్లో జరుగుతుంది, ఇందులో 3 వన్డేలు , 2 టెస్టులు ఆడనున్నాయి. సీనియర్ జట్టుతో పాటు భారత్ 'ఎ' జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టు బంగ్లాదేశ్‌లో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనున్నది.
దయాళ్‌కు వెన్ను గాయం
మీడియా కథనాల ప్రకారం.. తొలిసారిగా టీమ్ ఇండియాకు ఎంపికైన యశ్ దయాళ్ వెన్ను కింది భాగంలో సమస్య ఏర్పడింది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. మరోవైపు రవీంద్ర జడేజాకు మోకాలికి సంబంధించిన సమస్య ఇంకా వెంటాడుతోంది. ఆగస్టు-సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో నిష్క్రమించారు. అప్పటి నుంచి జడేజా జట్టునుంచి దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం ఇద్దరు ఆటగాళ్ల ఫిట్నెస్ను పర్యవేక్షిస్తోంది.