Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-0తో వేల్స్‌పై గెలుపు
దోహా (ఖతార్) : ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ గొప్పగా పుంజుకుంది. గ్రూప్-బి ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి చవిచూసిన ఇరాన్.. గ్రూప్ దశలో రెండో మ్యాచ్‌లో అదరగొట్టింది. శుక్రవారం వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించింది. 90 నిమిషాల పూర్తి ఆటలో ఇరు జట్లు గోల్ చేయటంలో విఫలమయ్యాయి. అదనపు సమయంలో ఇరాన్ ఏకంగా రెండు మెరుపు గోల్స్‌తో వేల్స్‌ను ముంచెత్తింది. అదనపు (ఇంజూరీ టైమ్) సమయం 8వ నిమిషంలో చెష్మి గోల్ కొట్టగా, 11వ నిమిషంలో రేజియన్ మరో గోల్‌తో మెరిశాడు. దీంతో 2-0తో ఇరాన్ ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసింది. 64 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఫిఫా ప్రపంచకప్‌లో ఆడుతున్న వేల్స్.. నాకౌట్ అవకాశాలను ఆవిరి చేసుకున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు వేల్స్‌పై విజయంతో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలను ఇరాన్ గణనీయంగా మెరుగుపర్చుకుంది.