Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యూనిషియాపై 1-0తో గెలుపు
- మిచెల్ డ్యూక్ గెలుపు గోల్
మిచెల్ డ్యూక్ మెరిశాడు, ఆస్ట్రేలియా మురిసింది. ఫిఫా ప్రపంచకప్‌లో గోల్ కరువు తీర్చుకుంది. 12 ఏండ్ల విరామం అనంతరం ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గెలుపు రుచి చూసింది. కఠిన గ్రూప్-డిలో ట్యూనిషియాపై ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా 1-0తో విజయం సాధించింది. ఈ విజయంతో నాకౌట్ ఆశలను కంగారూలు సజీవంగా నిలుపుకున్నారు.
అల్ వక్రా (ఖతార్)
'ఫుట్‌బాల్ ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కాగానే నా కుమారుడితో మాట్లా డాను. వరల్డ్‌కప్‌లో గోల్ కొట్ట గలననే నమ్మకం ఉండాలి. గోల్ కొట్టిన ఆనందాన్ని నీతో పంచు కుంటానని నా కొడుకుతో చెప్పాను. ప్రపంచకప్‌లో గోల్ నమోదు చేయటం నా జీవిత కాలం గుర్తుండుపోయే సన్నివేశం'. ట్యూనిషియాపై గెలుపు గోల్ నమోదు చేసిన ఆస్ట్రేలియా ఫార్వర్డ్ మిచెల్ డ్యూక్ భావోద్వేగం ఇది. శనివారం ట్యూనిషియాతో గ్రూపు మ్యాచ్ మొదలైన 23 నిమిషాల్లోనే ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించింది. మైదానం మొత్తం ట్యూనిషియా అభిమానులతో నిండిపోగా.. చాలా కొద్ది సంఖ్యలోనే ఆసీస్ అభిమానులు స్టేడియంలో ఉన్నారు. మిచెల్ డ్యూక్ గోల్ కొట్టగానే స్టేడియం నిశ్శబ్ధంగా మారిపోయింది!. ట్యూనిషియాపై 1-0తో గెలుపొందిన ఆస్ట్రేలియా.. నాకౌట్ ఆశలను సీజీవంగా నిలుపుకుంది. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రే లియా.. చివరి మ్యాచ్‌లో బలమైన డెన్మార్క్‌తో ఢకొీట్టనుంది.
డ్యూక్ ధనాధన్
గ్రూప్-డి ఆరంభ మ్యాచ్‌లో బలమైన డెన్మార్క్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది ట్యూని షియా. ఈ ఫలితం ఎవరూ ఊహిం చనిది. మరోవైపు ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో దారుణ పరాజయం చవి చూసింది. ట్యూనిషియాపై ఆస్ట్రేలియా ఫేవరేట్ ఏమీ కాదు. ఫిఫా ప్రపంచకప్ గత 12 ఏండ్లలో కంగారూలు ఒక్క విజయం సాధించలేదు. అయితే, ఆట ఆరంభమైన 23 నిమిషాల్లోనే మిచెల్ డ్యూక్ కంగారూలను ఆధిక్యంలో నిలిపాడు. మిడ్ఫీలర్డర్ క్రెయిగ్ గుడ్విన్ నుంచి క్రాస్ పాస్ అందుకున్న మిచెల్ డ్యూక్.. గోల్ కొట్టేశాడు. ఆస్ట్రేలియా గోల్‌పోస్ట్ వెనకాల ఉన్న కంగారూ అభిమా నులు సంబురాల్లో మునిగిపోయారు. 23వ నిమిషంలోనే గోల్ కొట్టిన మిచెల్ డ్యూక్.. ప్రథమార్థంలో ఆస్ట్రేలియాను ముందంజలో నిలిపాడు.
ద్వితీయార్థంలోనూ ట్యూని షియా, ఆస్ట్రే లియా గోల్ కోసం గట్టి ప్రయత్నాలే చేశాయి. ట్యూనిషియా ఏకంగా 14 సార్లు ఆస్ట్రేలియా గోల్‌పోస్ట్‌పై 14 సార్లు దాడి చేసింది. అందులో నాలుగు సార్లు లక్ష్యం దిశగా ఎటాక్ చేసింది. ఆస్ట్రేలియా తొమ్మిదిసార్లు గోల్ కోసం దాడి చేయగా.. రెండు సార్లు మాత్రమే లక్ష్యంపై కొట్టింది. మ్యాచ్‌లో 59 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకున్న ట్యూని షియా.. పాస్‌ల కచ్చితత్వంలోనూ కంగా రూలపై పైచేయి సాధించింది. ట్యూనిషియా ఏకంగా మూడు సార్లు ఆఫ్‌సైడ్ కావటం విశేషం. ఆసీస్ చేతిలో ఓడినా ట్యూనిషియా మంచి ప్రదర్శనే చేసింది. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో అత్యంత కఠిన గ్రూప్-డి. 2020 యూరో సెమీఫైనలిస్ట్, ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపి యన్. ఈ రెండు జట్లున్న గ్రూప్‌లో ట్యూనిషియా, ఆస్ట్రేలియా ఉనికి చాటుకునే ప్రయత్నం చేశాయి. డెన్మార్క్‌తో ట్యూనిషియా మ్యాచ్ డ్రాగా ముగి యగా, డెన్మార్క్‌తో ఆసీస్ ఇప్పుడు సమరానికి సిద్ధమవుతోంది. 12 ఏండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ ఫిఫా ప్రపంచకప్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మరో ఒక్క మ్యాచ్‌లో మెరుపు విజయంపై కన్నేసింది.