Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా 189 ఆలౌట్
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టులో ఐపీఎల్ వేలం హీరో కామెరూన్ గ్రీన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన మెల్బోర్న్ పిచ్‌పై కామెరూన్ గ్రీన్ (5/27) నిప్పులు చెరిగాడు. మిచెల్ స్టార్క్ (2/39) సైతం గ్రీన్‌కు తోడవటంతో బాక్సింగ్ డే టెస్టు తొలి రోజే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 68.4 ఓవర్లలో 189 పరుగులకే సఫారీలు చేతులెత్తేశారు. కైల్ వెర్రెయానె (52, 99 బంతుల్లో 3 ఫోర్లు), మార్కో జాన్సెన్ (59, 136 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీలతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. వంద టెస్టుల హీరో డెవిడ్ వార్నర్ (32 బ్యాటింగ్, 51 బంతుల్లో 3 ఫోర్లు) రాణించటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45/1తో ఆడుతోంది. మార్నస్ లబుషేన్ (5 బ్యాటింగ్) అజేయంగా ఆడుతున్నాడు. ఆసీస్ 144 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.