Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 జట్టుకు హార్దిక్ సారథ్యం
- వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వం
- శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్ల ప్రకటన
ముంబయి : కొత్త ఏడాది టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్య సారథ్యం వహించనున్నాడు. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్లను మంగళవారం ప్రకటించారు. చేతన్ శర్మ సారథ్యంలోని పాత సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. పొట్టి ఫార్మాట్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నాయకత్వం వహించనుం డగా.. వన్డే ఫార్మాట్‌కు రోహిత్ శర్మ తిరిగి నాయకత్వ పగ్గాలు అందుకోనున్నాడు. జనవరి 3న భారత్, శ్రీలంక తొలి టీ20 జరుగనుండగా, జనవరి 10న తొలి వన్డే జరుగనుంది. టీ20 జట్టులో విరాట్, రోహిత్, రాహుల్ చోటు చేసుకోలేదు. వన్డే జట్టులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై వేటు పడింది. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండు ఫార్మాట్ల జట్లలోనూ చోటు దక్కించుకోలేదు. విశ్రాంతి ఇచ్చారా? వేటు వేశారా? అనేది తెలియాల్సి ఉంది.
భారత టీ20 జట్టు : హార్దిక్ పాండ్య (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వెంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముకేశ్ కుమార్.
భారత వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.