Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 204 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయం నమోదు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన మెల్బోర్న్ పిచ్‌పై దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా రాణించలేదు. స్నిన్నర్ నాథన్ లయాన్ (3/58), స్కాట్ బొలాండ్ (2/49) రాణించటంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే కుప్పకూలింది. తెంబ బవుమా (65, 144 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీ సాధించగా, కైల్ వెరెనె (33, 40 బంతుల్లో 5 ఫోర్లు), డీ బ్రూన్ (28, 68 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ (0), జాండో (1), జాన్సెన్ (5), రబాడ (3), ఎర్వీ (21) విఫలమయ్యారు. కెరీర్ వందో టెస్టు హీరో డెవిడ్ వార్నర్ (200) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 575 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలగా.. 182 పరుగుల తొలి ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచుల టెస్టుల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. డెవిడ్ వార్నర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మూడో టెస్టు జనవరి 3న సిడ్నీలో ఆరంభం కానుంది.