Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను ఐసీసీ డబ్ల్యూటీసీ టేబుల్లో నాల్గో స్థానం మొదలెట్టిన టీమ్ ఇండియా 2-0 విజయంతో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను ఆశాజనకంగా ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుస టెస్టుల్లో పరాజయంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి పడిపోయింది. తిరుగులేని విజయాలతో ఆస్ట్రేలియా ఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా.. రెండో స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ నుంచి గట్టి పోటీ కనిపించింది. ఇంగ్లాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ పరాజయం పాకిస్థాన్ అవకాశాలను దెబ్బకొట్టగా, డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ ఈ సారి అసలు పోటీలోనే లేదు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో రెండు రోజుల్లోనే ఓటమి చెందిన దక్షిణాఫ్రికా.. బాక్సింగ్ డే టెస్టులోనూ భంగపడింది. ఈ రెండు ఓటములతో దక్షిణాఫ్రికా విజయాల శాతం 50కు పడిపోయింది. ఇదే సమయంలో భారత్ 58.93 గెలుపు శాతంతో రెండో స్థానం పదిలం చేసుకుంది. 53.33 గెలుపు శాతంతో శ్రీలంక మూడో స్థానంలో నిలిచింది.
అరంగేట్ర ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. డబ్ల్యూటీసీ 2 ఫైనల్ అవకాశాలను తన చేతుల్లోనే ఉంచుకుంది. భారత్ మరో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నాలుగు టెస్టుల్లో మూడు విజయాలు సాధిస్తే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. రెండు విజయాలు సాధించినా.. అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. కానీ మూడు మ్యాచుల్లో ఓటమి పాలైతే భారత్ చేజేతులా ఫైనల్ బెర్త్‌ను కోల్పోయే ప్రమాదంలో పడనుంది. 78.77 గెలుపు శాతంతో ఆస్ట్రేలియా 10 విజయాలు సాధించగా, భారత్ 8 విజయాలు నమోదు చేసింది. ఇంగ్లాండ్ 46.97 విజయ శాతంతో 22 మ్యాచుల్లో 10 విజయాలు సాధించినా ఆ జట్టు ఇప్పటికే ఆరు సిరీస్‌లు ఆడేసింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియా సన్నాహాక సిరీస్‌కు సిద్ధమవుతున్నాయని భావించవచ్చు!.