Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే నెల 10 నుంచి 13వ తేదీ వరకు కేరళలో జరగనున్న జాతీయ సబ్ జూనియర్ ఫెన్సింగ్ చాంపియనషిప్‌లో పాల్గొనే తెలంగాణ క్రీడాకారుల జాబితాను రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం ప్రకటించింది. శుక్రవారం దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ సెలెక్షన్సలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో సబ్ జూనియర్ అండర్-14 బాలికల ఫాయిల్ వ్యక్తిగత కేటగిరీలో కె.వైష్ణవి, బి.హేమ, ఫాతిమా, కె.నందిని, ఈపీ విభాగంలో అదీబా, అనన్య, శ్రీవెన్నెల, త్రివేణి, సబ్రి కేటగిరీలో అంజలి, హర్షిత, సాయి చరణ్య, బహతి వర్మ ఎంపికయ్యారు. బాలుర ఫాయిల్ కేటగిరీలో నాగచైతన్య, లక్షీనారాయణ, వరుణ్, సునీల్, ఈపీ విభాగంలో నాగసాయి, రిత్విక్, ప్రకాష్, ధనేష్, సబ్రి కేటగిరీలో పార్థసారథి, అశోక్, ప్రకాష్, గౌరవ్ సింగ్ పోటీ పడనున్నారు.