Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 131పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు
విజయనగరం: విజయనగరంలోని చింతల వలస పివిజి రాజు క్రికెట్ మైదానంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 131 పరుగులు తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజులుగా మహారాష్ట్ర, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో చివరి రోజు ఇరుజట్లను ఊరించిన విజయం మహారాష్ట్ర వైపు మొగ్గింది. మహారాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 200, రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసింది. ఆంధ్ర మొదటి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. శుక్రవారం మహారాష్ట్ర బౌలర్ల పైచేయి సాధించారు. ఓవర్‌నైట్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 100పరుగులతో నాల్గోరోజు ఆటను కొనసాగించిన ఆంధ్ర జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే జత చేసి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. 6 వికెట్లు తీసి మహారాష్ట్ర గెలుపులో కీలక పాత్ర పోషించిన బౌలర్ పిసి దదేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
18పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి
ఎలైట్ గ్రూప్-బిలో అస్సాం జట్టు 18పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. 250పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 231పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 9వికెట్ల నష్టానికి 228పరుగులతో చివరిరోజు ఆటను కొనసాగించిన హైదరాబాద్ జట్టు మరో 3పరుగులు జతచేసి చివరి వికెట్‌ను కోల్పోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రియాన్ పరాగ్‌కు లభించింది.