Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్
ఆల్మట్టి(కజకిస్తాన్): ఇక్కడ జరుగుతున్న ఫిడే ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన చివరి రౌండ్ మ్యాచ్‌ను గెలుపొందినా.. 12.5పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి రజత పతకానికి పరిమితమైంది. దీంతో అరపాయింట్ తేడాతో స్వర్ణ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో రాణించిన హంపి.. శుక్రవారం జరిగిన 17వ, చివరిరౌండ్ పోటీలో ఝోంగీ టాన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో తొలి 9రౌండ్లలోనే 4విజయాలు సాధించిన 35ఏళ్ల హంపి టాప్‌లో నిలిచింది. ఇక భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 14రౌండ్లు ముగిసేసరికి 7విజయాలను నమోదు చేసుకొని పతకం సాధించడంలో విఫలమైంది. స్వర్ణ పతకం బిబిసరా అసుభయేవా(కజకిస్తాన్)కు లభించగా.. పోలినా షువలోవా(రష్యా-ఫిడే)కు లభించాయి.