Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ నాకౌట్ పంచ్ విసిరాడు. హిసార్ వేదికగా జరుగుతున్న జాతీయ ఎలైట్ మెన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హుసాముద్దీన్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. డ్రా ప్రకారం తొలి రౌండ్లో హుసాముద్దీన్‌కు బై లభించింది. పురుషుల 57 కేజీల విభాగం రెండో రౌండ్ బౌట్లో నిజామాబాద్ చిన్నోడు 5-0తో అస్సాం బాక్సర్‌పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. ప్రీ క్వార్టర్ఫైనల్లో మిజోరాం బాక్సర్తో హుసాముద్దీన్ పోటీపడనున్నాడు.