Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియమించిన ముఖ్యమంత్రి కెసిఆర్
- రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్‌గా ఈడిగ ఆంజేయ గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్లో నియామక పత్రాన్ని ఆంజేయగౌడ్కు అందజేశారు. గతంలో బిసి కమిషన్ సభ్యులుగా పనిచేసిన ఆంజనేయ గౌడ్ రెండేండ్ల పాటు పదవిలో ఉండనున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ది కోసం తన వంతు కృషి చేస్తానని ఆంజనేయ గౌడ్ తెలిపారు.