Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాట్స్ నూతన చైర్మెన్ ఆంజనేయ గౌడ్
- మంత్రుల సమక్షంలో బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్
'గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉంది. గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేస్తాం. గ్రామీణ ప్రాంతంలో క్రీడాభివృద్దికి కృషి చేస్తానని' తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ ఈడిగ ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. శాట్స్ నూతన చైర్మెన్‌గా నియమితులైన ఆంజనేయ గౌడ్ గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల సమక్షంలో ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. 'ఆంజనేయ గౌడ్ ఉద్యమ, విద్యార్థి నేతగా పని చేశారు. ఉద్యమ నేతకు పదవి దక్కటం సంతోషం. కెసిఆర్‌తో కలిసి ఉద్యమంలో పోరాడిన వారికి దశల వారీగా అవకాశాలు దక్కుతాయని, అందరికీ న్యాయం జరుగుతుందని' అభినందన సభలో ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంపీ పి. రాములు, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తదితరులు ఆంజనేయ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. శాట్స్ చైర్మెన్‌గా ఆంజనేయ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు సహా క్రీడాకారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శాట్స్ చైర్మెన్‌గా బాధ్యతలు అందుకున్న ఆంజనేయ గౌడ్ అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులు పొందారు.