Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్ర ఘన విజయం
విజయనగరం: విజయనగరం లోని చింతల వలస పివిజి రాజు క్రికెట్ మైదానంలో జరుగుతున్న రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయం సాధించింది. 401పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా హైదరాబాద్ ఓవర్‌నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన 246పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ జట్టు 154 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 135 పరుగులు, హైదరాబాద్ జట్టు 197 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 462 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హైదరాబాద్ 246 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో కెవి శశికాంత్ ఐదు వికెట్లు, సుదర్శన్ మూడు వికెట్లు సాధించి ఆంధ్ర జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 10నుంచి హైదరాబాద్-సౌరాష్ట్ర, ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనున్నాయి.