Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్ఫరాజ్ సెంచరీ, చివర్లో నసీమ్ షా మెరుపులు
- పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండో టెస్ట్ డ్రా
కరాచీ: పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో, చివరి టెస్ట్ డ్రా అయ్యింది. 319పరుగుల లక్ష్యంతో ఐదోరోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్ జట్టును మాజీ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీకి తోడు చివర్లో యువ పేసర్ నసీమ్ షా అద్భుత బ్యాటింగ్‌తో మెరుపులతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌ను పాక్ జట్టు డ్రా చేసుకుంది. పాకిస్తాన్ 287పరుగులకు 9వికెట్లు కోల్పోయి ఓటమిదశలో ఉండగా.. నసీమ్ షా న్యూజిలాండ్ బౌలర్లకు అడ్డుగోడగా నిలిచి వికెట్ పడకుండా ఆడాడు. వికెట్ల చుట్టూ ఫీల్డర్లు పొంచి ఉన్నా.. వారి పైనుంచి బంతులను కొట్టి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో వెలుతురు లేమితో మ్యాచ్ నిలిచే సమమయానికి పాక్ జట్టు 9వికెట్లు కోల్పోయి 304పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓ దశలో 80పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్(118) అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. 6వ వికెట్‌కు సర్ఫరాజ్ ఖాన్ షకీల్‌తో కలిసి 123పరుగులు, అఘా సల్మాన్‌తో కలిసి 7వి వికెట్‌కు 70పరుగులు చేశాడు. దీంతో ఛేదన దిశగా వెళ్తున్న పాకిస్తాన్‌ను.. న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేశారు. చివర్లో 11వ వికెట్‌కు నసీమ్ షా(15నాటౌట్), అబ్రార్(7) కలిసి 21బంతుల్లో 17పరుగులు జతచేసి న్యూజిలాండ్ విజయానికి కళ్లెం వేశారు. చివర్లో 4ఓవర్లలో 15పరుగులు చేస్తే పాక్ గెలుస్తుందనుకున్న దశలో అంపైర్లు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 0-0తో డ్రా అయ్యింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ సర్ఫరాజ్ అహ్మద్‌కు లభించగా.. మూడు వన్డేల సిరీస్ 9నుంచి ప్రారంభం కానుంది.