Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారిన్‌తో మ్యాచ్‌లో రీ ఎంట్రీ ొమలేషియా ఓపెన్ సూపర్ సిరీస్
కౌలాలంపూర్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు పునరాగమనానికి రంగం సిద్ధం చేసుకుంది. కాలు కండరాల గాయంతో గతేడాది సుమారు సగం సీజన్‌కు పూర్తిగా దూరమైన తెలుగు తేజం కొత్త ఏడాదిలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 10 నుంచి ఆరంభం కానున్న మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో పి.వి సింధు పోటీపడనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చిరకాల ప్రత్యర్థి కరొలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడనుంది. ఒలింపిక్ చాంపియన్ కరొలినా మారిన్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతుండగా, భారత స్టార్ షట్లర్‌కు ఆరో సీడ్ లభించింది.
పారిస్ పసిడి లక్ష్యంగా!
'సుదీర్ఘ విరామం. కామన్వెల్త్ క్రీడల అనంతరం ఐదు నెలల తర్వాత మళ్లీ ఆడబోతున్నాను. పునరాగమనం ఆసక్తిగా అనిపిస్తోంది. గొప్ప ఏడాదిగా సాగుతుందని ఆశిస్తున్నాను. కరొలినా మారిన్‌తో తొలి మ్యాచ్ ఆడనుండటం బాగుంది. మారిన్‌తో పోటీ ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. రీ ఎంట్రీ ఆరంభంలోనే మారిన్ వంటి చాంపియన్‌తో ఆడటం నాకు కూడా మేలు చేస్తుంది.
నా ఆటను నేను విశ్లేషించుకునే వీలు చిక్కుతుంది. గాయం నుంచి కోలుకోవటంపైనే ఇంత కాలం దృష్టి పెట్టాను. అమ్మా నాన్నలతో పాటు కోచ్ పార్క్, ట్రైనర్ శ్రీకాంత్ వర్మ, ఫిజియో వెవెంజిలె రీ ఎంట్రీ చక్కగా ప్లాన్ చేశారు. ప్రాక్టీస్ సెషన్లో చూడదగ్గ స్ట్రోక్స్ ఆడుతుండటం సంతోషంగా ఉంది. ఒత్తిడి అంటూ ఏమీ లేదు. అంతర్జాతీయ స్థాయి ఆటకు అలవాటు పడ్డాను. ఎటువంటి సవాల్‌నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. త్వరలో ఒలింపిక్ అర్హత ప్రక్రియ ఆరంభం కానుంది. అత్యున్నత స్థాయిలో ఆడటం ఎప్పుడూ మంచి అనుభూతి అందిస్తుంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో.. అల్టిమేట్ లక్ష్యం పసిడి పతకం నెగ్గటమే' అని సింధు తెలిపింది.
మలేషియా ఓపెన్‌లో భారత వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ సైతం బరిలో నిలిచింది. అన్‌సీడెడ్‌గా ఆడనున్న మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్.. తొలి రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువెతో పోటీపడనుంది. చైనీస్ తైపీ షట్లర్ వెన్ చీతో యువ షట్లర్ ఆకర్షి కశ్యప్ ఆడనుంది. మాళవిక బాన్సోద్.. దక్షిణ కొరియా స్టార్, రెండో సీడ్ యంగ్‌తో తొలి రౌండ్లో తలపడనుంది. ఇక మెన్స్ సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్‌కు కఠిన డ్రా ఎదురైంది. తొలి రౌండ్లో జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటతో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
భారత యువ కెరటం లక్ష్యసేన్‌తో సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు తొలి రౌండ్లో పోటీపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు తొలి రౌండ్లో దక్షిణ కొరియా జోడీతో ఢకొీట్టనుంది.