Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి సౌరాష్ట్రతో రంజీ పోరు
హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో నిలకడగా చెత్త ప్రదర్శన చేస్తున్న హైదరాబాద్ నేడు మరో సవాల్‌కు సిద్ధమైంది. ఎలైట్ గ్రూప్- బిలో అగ్రస్థానంలో నిలిచిన సౌరాష్ట్రతో హైదరాబాద్ తలపడనుం ది. సౌరాష్ట్ర నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు డ్రాలతో జోరుమీదుం డగా.. హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో ఏకంగా మూడింట పరాజయాలు చవిచూసింది. సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో పచ్చిక పిచ్ సిద్ధం చేశారు. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించకపోవటం హైదరాబాద్ కు ప్రతికూలంగా మారుతోంది. తన్మరు అగర్వాల్, రవితేజ, రోహిత్ రాయుడు, కార్తికేయలు హైదరాబాద్‌కు కీలకం కానున్నారు. సౌరాష్ట్ర, హైదరాబాద్ రంజీ మ్యాచ్ నేడు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది.