Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూట్స్ కొలీజియం విద్యాసంస్థల ప్రకటన
హైదరాబాద్ : భారత చెస్ ముఖచిత్రం, 15 ఏండ్ల పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకుని చరిత్ర సృష్టించిన కోనేరు హంపీ.. రూట్స్ కొలీజియం విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. సమగ్ర విద్యను అందించటంలో 30 ఏండ్ల వారసత్వ వేడుక సందర్భంగా.. కోనేరు హంపీని ప్రచారకర్తగా నియమించారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రూట్స్ కొలీజియం విద్యా సంస్థల చైర్మెన్ బి.పి పడాల ఈ మేరకు ప్రకటించారు. 'రూట్స్ కొలీజియం ప్రచారకర్తగా వ్యవహరించటం ఎంతో సంతోషం. రూట్స్ కొలీజియం, నేను 30 ఏండ్ల క్రితం ప్రయాణం మొదలుపెట్టాం. సుమారుగా మా ఇద్దరికీ ఒకే కథ. ప్రచారకర్తగా కళాశాల స్థాయిని పెంచేందుకు కృషి చేస్తాను. బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు' అని కోనేరు హంపీ తెలిపింది.