Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్సాంతో
ముంబయి రంజీ మ్యాచ్
గువహటి : ముంబయి చిన్నోడు పృథ్వీ షా (379, 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో అస్సాం బౌలర్లను ఊచకోత కోసిన పృథ్వీ షా 49 ఫోర్లు, 4 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. కెప్టెన్ అజింక్య రహానె (191, 302 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కటంతో అస్సాంపై రంజీ మ్యాచ్‌లో ముంబయి భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 687/4 వద్ద ముంబయి డిక్లరేషన్ ప్రకటించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 129/1తో ఎదురీదుతుంది. అస్సాం మరో 558 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకంజలో కొనసాగుతోంది.