Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : భారత స్టార్ షట్లర్ పి.వి సింధు పునరాగమనంలో తడబాటుకు గురైంది. గాయంతో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నుంచీ షటిల్ కోర్టుకు దూరమైన సింధు.. సుదీర్ఘ విరామం అనంతరం మలేషియా ఓపెన్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు మూడు గేముల మ్యాచ్‌లో పరాజయం పాలైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో12-21, 21-10, 15-21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరొలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చెందింది. తొలి గేమ్‌లో ఓడిన సింధు.. రెండో గేమ్‌లో పుంజుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మారిన్ పైచేయి సాధించింది. 21-16తో మూడో గేమ్ నెగ్గి తర్వాతి రౌండ్‌కు చేరుకుంది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన సింధుపై విజయంతో అన్‌సీడెడ్ మారిన్ ముఖాముఖి రికార్డును 10-5కు మెరుగుపర్చుకుంది. కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ సైతం మలేషియా ఓపెన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.