Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతకంపై కన్నేసిన టీమ్ ఇండియా ొనేటి నుంచి హాకీ ప్రపంచకప్
భారత క్రీడా రంగంలో జీవిత కాల స్వర్ణయుగాన్ని ఆస్వాదించిన ఆట హాకీ. సువర్ణాక్షరాలతో కూడిన చరిత్ర కలిగిన హాకీ.. పూర్వ వైభవానికి ఎప్పుడూ దూరంగానే ఉంటోంది!. 1975లో చివరగా ప్రపంచకప్‌లో పతకం సాధించిన భారత్.. 1982 తర్వాత తొలిసారి వరల్డ్‌కప్‌లో ఒలింపిక్ మెడలిస్ట్గా పోటీపడుతోంది. వరుసగా రెండోసారి ఒడిశా ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ నేటి ఆరంభం కానుంది. ఆతిథ్య భారత్ పతకంపై కన్నేసి సొంతగడ్డపై బరిలోకి దిగుతోంది. మన ఆటగా ప్రసిద్ధి గాంచిన హాకీలో టీమ్ ఇండియా మరోసారి మాయ చేస్తుందా? చూడాలి.
నవతెలంగాణ-భువనేవ్వర్
2023 ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం. 16 జట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్‌ను వరుసగా రెండోసారి నిర్వహించేందుకు ఒడిశా ముస్తాబైంది. రౌర్కెలా, భువనేశ్వర్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్న హాకీ ప్రపంచకప్ జనవరి 13 నుంచి ఆరంభం కానుంది. 2018 హాకీ ప్రపంచకప్ సైతం ఒడిశాలోనే జరిగింది. 2022లో 15వ హాకీ వరల్డ్‌కప్ నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో 2023 జనవరికి వాయిదా పడింది. నేడు ఆరంభం కానున్న హాకీ వరల్డ్‌కప్ విషయాలు తెలుసుకుందాం.
వరుసగా రెండోసారి :
ప్రపంచకప్‌లు వరుసగా రెండు సీజన్లు ఒకే వేదికపై నిర్వహించటం దాదాపుగా జరుగదు. కానీ ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ వరుసగా రెండు సార్లు ఒకే వేదికపై జరుగనుంది. 2018 మెన్స్ హాకీ వరల్డ్‌కప్‌కు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా నిలిచింది. 2023 మెన్స్ హాకీ ప్రపంచకప్ మ్యాచులు కళింగ స్టేడియంతో పాటు బుర్సా ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగనున్నాయి. 2010 మెన్స్ హాకీ ప్రపంచకప్ సైతం భారత్‌లోనే జరుగగా, న్యూఢిల్లీ వేదికగా నిలిచింది.
గతంలో ఎవరు నెగ్గారు? :
బెల్జియం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. 2018 ఫైనల్లో షూటౌట్లో నెదర్లాండ్స్‌పై బెల్జియం పైచేయి సాధించింది. ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ ప్రపంచకప్‌లో అత్యధిక పతకాలు సాధించిన జట్టు పాకిస్థాన్. పేలవ ప్రదర్శనలతో 2023 హాకీ ప్రపంచకప్‌కు ఆ జట్టు అర్హత సాధించలేదు. అగ్రజట్టు ఆస్ట్రేలియా లేకుండా జరిగిన టైటిల్ పోరుగా 2018 ఫైనల్ ప్రసిద్ది. తాజా వరల్డ్‌కప్‌కు డిఫెండింగ్ చాంపియన్ బెల్జియంతో పాటు ఆస్ట్రేలియా సైతం టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
బరిలోని జట్లు, ఫార్మాట్ :
2023 హాకీ ప్రపంచకప్‌లో 16 జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్ దశలో 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌లో 2, 3వ స్థానాల్లో నిలిచిన ప్రీ క్వార్టర్‌ఫైనల్ ఆడతాయి. అందులో విజేత క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించనుంది.
గ్రూప్-ఏ : ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణ ఆఫ్రికా
గ్రూప్-బి : బెల్జియం, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్
గ్రూప్-సి : నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేషియా, చిలీ
గ్రూప్-డి : భారత్, స్పెయిన్, ఇంగ్లాండ్, వేల్స్
భారత్ అవకాశాలు ఎలా?
1982 తర్వాత తొలిసారి భారత జట్టు హాకీ ప్రపంచకప్‌లో ఒలింపిక్ పతక విజేతగా అడుగుపెడుతోంది. గ్రాహమ్ రీడ్ (ఆస్ట్రేలియా) టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్లో బెల్జియం చేతిలో భారత్ ఓడగా, కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో ఆస్ట్రేలియాకు పసిడి కోల్పోయింది. యువ నాయకుడు హర్మన్‌ప్రీత్ సింగ్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో మంచి ప్రదర్శన చేసిన భారత్ ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో పతకం ఆశిస్తోంది. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు అడ్డు నిలిచిన బెల్జియం, ఆస్ట్రేలియాలే ఈసారి పతక రేసులో సవాల్ విసరనున్నాయి. 2018 ప్రపంచకప్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. క్వార్టర్ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో కంగుతింది. గ్రూప్ దశలో బెల్జియంను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించినా.. పతకం దక్కకుండా పోయింది.
2023 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ కఠిన సవాల్ ఎదుర్కొనుంది. గ్రూప్-డిలో భారత్ ఉంది. స్పెయిన్, ఇంగ్లాండ్, వేల్స్లు భారత్‌తో పోటీపడనున్నాయి. నేడు తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుండగా.. జనవరి 15న ఇంగ్లాండ్‌తో, జనవరి 19న వేల్స్‌తో పోటీపడనుంది. స్పెయిన్, ఇంగ్లాండ్‌తో మ్యాచులు రౌర్కెలాలో జరుగనుం డగా, వేల్స్‌తో మ్యాచ్‌కు భువనేశ్వర్‌లో షెడ్యూల్ చేశారు.
భారత జట్టు : పీఆర్ శ్రీజేశ్, క్రిషన్ పాఠక్ (గోల్‌కీపర్లు). జర్మన్‌ప్రీత్ సింగ్, సురెందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్ (వైస్ కెప్టెన్), నీలం సంజీప్ (డిఫెండర్లు). మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, శంషిర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అకాశ్‌దీప్ సింగ్ (మిడ్‌ఫీల్డర్లు). మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యారు, అభిషేక్, సుఖజిత్ సింగ్ (ఫార్వర్డ్సు). రాజ్‌కుమార్ పాల్, జుగ్రాగ్ సింగ్ (రిజర్వ్ ఆటగాళ్లు).