Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ ప్రపంచకప్
రూర్కెలా(ఒరిస్సా): హాకీ ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన పోటీల్లో గ్రూప్-సిలో నెదర్లాండ్స్, న్యూజిలాండ్, గ్రూప్-బిలో జర్మనీ, బెల్జియం జట్లు శుభారంభం చేశాయి. రూర్కెలాలోని బిర్సాముండా హాకీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన పూల్-సి హాకీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 3-1గోల్స్ తేడాతో చిలీపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 4-0తో మలేషియాను చిత్తు చేసింది. నెదర్లాండ్స్ యువ ఆటగాడు టన్ బియాన్ పెనాల్టీ కార్నర్స్‌ను అద్భుంతంగా గోల్స్‌గా మలిచాడు. మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా జొర్రిట్ క్రూన్ మరో గోల్ కొట్టి నెదర్లాండ్స్ ఆధిక్యతను 4-0కు పెంచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జొర్రిట్ క్రూన్(నెదర్లాండ్స్)కు లభించింది. దీంతో నెదర్లాండ్స్, న్యూజిలాండ్ జట్లకు మూడేసి పాయింట్లు దక్కాయి. ఇక భువనేశ్వర్ వేదికగా జరిగిన పూల్-బిలో బెల్జియం జట్టు 5-0తో దక్షిణ కొరియాను చిత్తుచేసింది. మరో మ్యాచ్‌లో జర్మనీ జట్టు 3-0తో జపాన్ను ఓడించి శుభారంభం చేసింది.