Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వన్డేలో శ్రీలంకపై 317పరుగుల తేడాతో విజయం
- సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్
తిరువనంతపురం: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 317పరుగుల భారీ తేడాతో గెలిచి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 390 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక జట్టు 22 ఓవర్లలో 73పరుగులకే కుప్పకూలింది. తొలుత విరాట్ కోహ్లి (166నాటౌట్) వన్డేల్లో 46వ సెంచరీని, ఓవరాల్‌గా 74వ సెంచరీకి తోవడు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా (116పరుగులు)సెంచరీ కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు 131పరుగులు జతచేశారు. తొలుత రోహిత్-గిల్ కలిసి 15.2ఓవర్లలో 95పరుగులు జతచేశారు. రజితకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్(4/32) బౌలింగ్‌లో రాణించడంతో శ్రీలంక జట్టు 73పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ విరాట్ కోహ్లికి లభించింది.