Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023
మెల్బోర్న్ : తొమ్మిదిస్లారు చాంపియన్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారం భం చేశాడు. గత ఏడాది హైడ్రామా అనంతరం ఆస్ట్రే లియా ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న జకోవిచ్ మెన్స్ సింగిల్స్‌లో తొలి రౌండ్లో స్పెయిన్ ఆటగాడిపై వరుస సెట్లలో అలవోక విజయం నమోదు చేశాడు. 6-3, 6-4, 6-0తో రాబర్లో కార్బెల్లాస్ బేనా (స్పెయిన్)ను చిత్తుగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో ప్రత్యర్థికి గేములు కోల్పోయినా.. చివరి సెట్లో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ఓటమి నుంచి గట్టెక్కాడు. ఇటలీ ఆటగాడు బెరాటినిపై తొలి రెండు సెట్లను 6-3, 6-3తో నెగ్గిన ముర్రే.. తర్వా తి రెండు సెట్లను 4-6, 6-7(7-9)తో చేజార్చు కున్నాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌ను 7-6(10-6)తో టైబ్రేకర్‌లో గెలుపొందిన ముర్రే తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాడు. మెల్బోర్న్లో వేడి గాలుల కారణంగా మంగళవారం జరగాల్సిన చాలా మ్యాచులు మధ్యలో నిలిచిపోగా, మరికొన్ని మ్యాచులను రీ షెడ్యూల్ చేశారు.