Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. తిరువనంతపురంలో శ్రీలంకతో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ వెన్నుపూస గాయానికి గురయ్యాడు. నొప్పి ఉందంటూ శ్రేయస్ జట్టు ఫిజియోకు ఫిర్యాదు చేయగా.. తదుపరి పరీక్షలు, చికిత్స, రిహాబిలిటేషన్ నిమిత్తం శ్రేయస్ అయ్యర్‌ను బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపించారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో రాణించిన రజత్ పటీదార్‌ను బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.