Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ రవిచంద్రకు పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాము ఎదుర్కొంటున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ఎంపీ రవిచంద్రను కోరింది. ఈమేరకు హైదరాబాద్ అసోసియేషన్ నేతలు అమరేందర్‌రెడ్డి, వినోద్ విశ్వనాధ్, ఎల్వీ కుమార్ తదితరుల బృందం ఆయనకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర పెట్రోలియం మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించినట్టు తెలపారు.