Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వేలో 'మ్యాన్ ఆఫ్ ద మంత్' భద్రత అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సిబ్బందికి అందచేశారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం వర్చువల్‌గా జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో 66 మంది ఉద్యోగులు ఈ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో అప్రమతంగా ఉంటూ, సకాలంలో సమయస్ఫూర్తితో భద్రతాపరమైన చర్యలు తీసుకున్నందుకు వీరిని సత్కరిస్తున్నట్టు చెప్పారు. అవార్డు గ్రహీతల్లో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, కీ మెన్, ట్రాక్‌మెన్, గేట్మెన్ వంటి వివిధ విభాగాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు.