Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ మహిళా, మైనార్టీ మోర్చాల నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ యువ మోర్చా నేతలను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్దే అడ్డుకున్నారు.