Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీచింగ్ ఆస్పత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా బోధనాస్పత్రుల్లో నియమించింది. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల అధ్వర్యంలో రేడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం అర్హులతో కూడిన సెలక్షన్ లిస్ట్ విడుదల చేయగా, ఆయా పోస్టుల్లో తమకు వెయిటేజీ కావాలని కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. దీంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆలస్యం కావడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, ప్రక్రియ త్వరగా పూర్తి అయ్యేలా చొరవ చూపింది. ఈ క్రమంలో కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో భర్తీకి మార్గం సుగమమైంది. టీఎస్పీఎస్సీ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన వెంటనే, సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి, వారికి పోస్టింగులు ఇస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.