Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుర్ర వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వడ్డెర వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. వడ్డెర వృత్తిదారుల సంఘం క్యాలెండర్ను సోమవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర వృత్తిదారులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారనీ, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుంచం వెంకటకృష్ణ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇడగొట్టి సాయిలు, పల్లపు విగేష్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ డేరంగుల రామకృష్ణ, రాష్ట్ర నాయకులు దండుగుల నరసింహులు, డేరంగుల కృష్ణ, బొంత కొమురెల్లి ఇరగ దిండ్ల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.