Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరణలో మంత్రి తలసాని వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెలు, మేకల పెంపకందారులసంఘం (జీఎంపీఎస్) రూపొందించిన డైరీ...గొర్లకాపర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జీఎంపీఎస్ డైరీ-2023ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొర్లకాపరులకు, ప్రభుత్వానికి మధ్య ఈ డైరీ వారధిగా ఉంటుందని తెలిపారు. గొర్లు, మేకలకు ఏ నెలలో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో, ఎలాంటి మందులు వాడాలో డైరీలో ముద్రించడం మంచి పరిణామమన్నారు. వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న ఆవులు, గొర్రెల కాపరులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 3.94 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసిందనీ, తద్వారా గొల్లకురుమల కుటుంబాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ఈ పథకం కోసం రూ ఐదువేల రూపాయలను ఖర్చు చేశామన్నారు. రెండో విడత పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. గొర్లకాపరులు కిందిస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్, ఉడుత రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శిలు అమీర్ పేట్ మల్లేష్, బొల్లం అశోక్, అవిశెట్టి శంకరయ్య, కాడబోయిన లింగయ్య, తుషాకుల లింగయ్య, సాదం రమేష్, కాల్వ సురేష్, ఎక్కలదేవి కొమురయ్య, బి.శ్రీనివాస్, చేపూరి ఓదెలు, కడెం లింగయ్య, శాతవేణి రమేష్, మోటె దేవేందర్, పయ్యావుల మల్లయ్య, గౌర శ్రీశైలం, కె.యాకయ్య, వి.రమేష్, జి. సమ్మయ్య, కె.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.