Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సరైన విద్య లేకుంటే మానవ సమాజం పురోగతి సాధించలేదని తెలిపారు. విద్యకు సరైన ప్రాధాన్యం ఇచ్చిన సమాజం మాత్రమే తన లక్ష్యాలను చేరుకుంటుందని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర విద్యార్థి విభాగం సబ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనీ, మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో అమ్మాయిలు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. అన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలను, లైబ్రరీలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలనీ, అదేవిధంగా టీచర్ల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కూనంనేని డిమాండ్ చేశారు.సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నిర్మాణ బాధ్యులు తక్కలపల్లి శ్రీనివాస్ రావు, సబ్ కమిటీ కన్వీనర్ పుట్ట లక్ష్మణ్, సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, అశోక్ స్టాలిన్, రెహమాన్, రఘురాం నరేష్, సంతోష్ పాల్గొన్నారు.