Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మెట్రో రైల్ ఎమ్డీ ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెట్రో రైల్ పొడిగింపునకు రూ.254 కోట్లు మంజూరు చేయాలని ఆ సంస్థ ఎమ్డీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పట్టణాభివద్ధి, హౌసింగ్ వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం హైదరాబాద్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును సమీక్షించింది. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణానికి చర్యలు చేపట్టామమని తెలిపారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం తదితర పథకాలను వివరించారు. పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో స్థానిక సంస్థల సంఖ్యను 68 నుంచి 142కు పెంచినట్టు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్ పాల్గొనగా, సమావేశానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ లాలన్ సింగ్ అధ్యక్షత వహించారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులు చర్చించారు.