Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ డి.జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ-నాగోల్
మంచి ఆశయంతో ఏర్పడిన ఫ్రెండ్స్ క్లబ్ 15 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ స్నేహితులను, క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ డి.జనార్దన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాగోల్ డివిజన్లోని బండ్లగూడలో గల వి- స్పోర్ట్స్ అకాడమీలో ఫ్రెండ్స్ క్లబ్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్స్ కప్-2023 ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు అందరూ కలిసి రావడం మంచి నిర్ణయమన్నారు. తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని, క్రీడాకారులకు తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని శ్రీనివాస గుప్త తెలిపారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ను నిర్వాహకులు సన్మానించారు. టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించిన వారు.. 35 ప్లస్ విభాగంలో వేణు, కార్తీక్, 50 ప్లస్ విభాగంలో వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ నరేష్, ఏసీపీ వెంకట్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ శోభన్ బాబు, నరేందర్, రాజిరెడ్డి, రఘుపతి రెడ్డితోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.