Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎమ్‌సీఏ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ప్రదర్శన
- సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న జిల్లా కేంద్రాల్లో వాహన ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. హైదరాబాద్ నగరంలో నారాయణగూడ (వైఎంసీఏ) నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు వాహన ప్రదర్శన ఉంటుందని పేర్కొంది. సోమవారం విద్యానగర్‌లోని మార్క్స్‌భవన్‌లో ఎస్కేఎం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు తీగల సాగర్, పశ్యపద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, జక్కుల వెంకటయ్య, ప్రసాదన్న మాట్లాడుతూ....కనీస మద్దతు ధరల చట్టం చేయడం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతు రుణమాఫీ, లఖింపూర్ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనే ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనీ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్న కారు రైతులకు కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించాలని కోరారు. కేరళ ప్రభుత్వ తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతురుణ మాఫీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులు, మహిళలు, విద్యార్థి, యువజనులు, గిరిజన, సామాజిక, మైనారిటీ సంఘాలు ఐక్యంగా వాహన ర్యాలీలో పాల్గొనాలనివిజ్ఞప్తిచేశారు.ఈకార్యక్రమంలోబాల్రాజు(ఎఐటీయూసీి), మధు(సీఐటీయూ),శ్రీరాంనాయక్(గిరిజనసంఘం),ఝాన్సీ
(పీవోడబ్ల్యూ),ప్రదీప్(పీివైఎల్),పి.జంగారెడ్డి,మూడ్‌శోభన్(తెలంగాణరైతుసంఘం),కోటేశ్వరరావు,మండలవెంకన్న(ఎఐకేఎంఎస్్),నీతు శర్మ(తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం) తదితరులు పాల్గొన్నారు.