Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భావ సారూప్యత సంఘాలతో ఐక్య ఉద్యమాలు
- ఉత్పాదక వర్గాలతో కలిసి పోరాటాలు: సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మరిన్ని సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని బెంగళూరులో జరిగిన సీఐటీయు 17వ జాతీయ మహాసభ పిలుపునిచ్చినట్టు జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు తెలిపారు. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరిన్ని పోరాటాలకు త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని మహాసభలో నిర్ణయించినట్టు వివరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సోమవారం సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నుంచి 22వ తేదీ వరకు బెంగళూరులోఅత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ మహాసభకు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ వాంబిష్ క్రిష్టిస్తోపాటు చేగువేరా కూతురు అలైదా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్టు చెప్పారు.
ధరల పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమవు తుందన్నారు. బీజేపీ నయా ఉదారవాద విధానాల వల్ల దేశం మరింత సంక్షోభంలోకి కూరుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతు న్నాయన్నారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే.. వారిలో 93 శాతం మంది వరకు రూ.పది వేలలోపు వేతనం ఉన్నవారేనని చెప్పారు. వీరి హక్కుల కోసం త్రిముఖ వ్యూహంతో పోరాటాలు నిర్వహించాలని మహాసభ నిర్ణయించినట్టు చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలను కార్మికులు అర్థం చేసుకునే చైతన్యం తీసుకురావడం మొదటి వ్యూహంగా తెలిపారు. ఏఐటీయుసీ, ఐఎన్ టీయుసీ వంటి భావ సారూప్యత సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించాలనేది రెండో వ్యూహంగా తెలిపారు. ఉత్పాదకవర్గంగా ఉన్న రైతులు, కూలీలు, కార్మికులు సంపద సృష్టిస్తుంటే ఆ వర్గాలపై దాడులు చేసే విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలతో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించాలనేది మూడో వ్యూహంగా తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా.. కార్మికుల సమస్యలపై ఏప్రిల్ 5న ఢిల్లీలో కార్మిక పోరు, ఐదు లక్షల మందితో మహాధర్నా నిర్వహిం చనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్, వై.విక్రం, సహాయ కార్యదర్శులు రమ్య, మోదం శ్రీనివాసరావు, పెరుమాళ్లపల్లి మోహన్ రావు, నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.