Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ తీర్మానం
- రైల్వేపాసుల కోసం ఎంపీలకు వినతిపత్రాలు
- పూర్తిస్థాయిలో హెల్త్‌కార్డులు అమలుచేయాలని డిమాండ్
నవతెలంగాణ -హైదరాబాద్
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం వెంటనే విధానాన్ని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర కేంద్రం హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చెయాలని కోరింది.
సమస్యల పరిష్కారం కోసం ఈనెలా ఖరులో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టాలని తెలంగాణ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం తీర్మానించింది. హైదరాబాద్‌లోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీసు బేరర్ల సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య గత కార్యకలాపాలపై నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొం టున్న సమస్యలను చర్చించి ఆఫిస్ బేరర్ల సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలనీ, ఈ దీక్షల్లో అన్ని జిల్లా కమిటీల బాధ్యులు, జర్నలి స్టులు పాల్గొనాలని సమావేశం పిలుపునిచ్చింది.
ఇండ్ల స్థలాల సమస్య గత 35 సంవత్సరాలుగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనల సందర్భంగా అనేక చోట్ల హమీలు ఇచ్చారని చెప్పారు. వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే హౌసింగ్ సొసైటీలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లోనూ అనేక మంది జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
అదే విధంగా జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసుల సమస్యను పార్లమెంటు సమా వేశాల్లో చర్చించి వాటిని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీ లకు చెందిన పార్లమెంటు సభ్యులకు వినతిపత్రాలు సమర్పించాలని సమావేశం తీర్మానించింది.
జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరిగా పనిచేయడం లేదనీ, ఈ సమస్యపై వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును మరోసారి కలవాలని నిర్ణయించింది. అలాగే ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 5న నిర్వహించాలనీ, అనంతరం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు.