Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు : మంత్రి కేటీఆర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏడు సంవత్సరాలుగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్థి చెందుతుందన్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వస్తువుల డెలివరీని వేగవంతం చేసేందుకు ప్రైమ్ ఎయిర్ పేరిట కొత్త సేవలను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందని గుర్తు చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని వెల్లడించారు.
ఏవియేషన్ రంగంలో తెలంగాణ వేగంగా అభివద్ధి చెందుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. హైదరాబాద్ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు. అమెజాన్ ఎయిర్ సేవల్లో భాగంగా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వస్తువులను త్వరితగతిన డెలివరీ చేయడానికి గానూ బోయింగ్ 737-800 విమానాలను వినియోగించనుంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ సంస్థతో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో ఒక ఈ-కామర్స్ సంస్థ థర్డ్ పార్టీ విమానసేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. అమెజాన్ ఎయిర్ వల్ల సుమారు 11 లక్షల మంది సెల్లర్లకు మేలు చేకూరనుందని అమెజాన్ ప్రతినిధి అఖిల్ సక్సేనా తెలిపారు.