Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణీకులతో ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్ కుమార్ జైన్ మాటామంతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ అనుభవాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ప్రయాణీకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రైలులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రయాణం సుఖవంతంగా ఉందా? ఆహారం నాణ్యంగా ఉందా? రైలులో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నారు? వంటి పలు అంశాలను ఆయన నేరుగా ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వందేభారత్‌లో ప్రయాణించారు. ఆయనతోపాటు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎ.కె.గుప్తా, ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. అలాగే రైలులోని ఆన్-బోర్డు సిబ్బందితో కూడా సంభాషించారు. భద్రతా సౌకర్యాలు, క్యాటరింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. ఖమ్మం-వరంగల్ స్టేషన్ల మధ్య ఆయన ఇంజిన్‌లో ప్రయాణిస్తూ ట్రాక్‌ను పరిశీలించారు. సెమీ హైస్పీడ్ రైళ్లలో లోకో పైలట్లు, ఇతర సిబ్బంది అనుసరిస్తున్న భద్రతా విధానాలను తెలుసుకున్నారు. సెక్షన్ సిగల్ వ్యవస్థ, ట్రాక్ సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభించిందనీ, వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.