Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలంటూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ప్రగతిభవన్, డీజీపీ, టీఎస్సీపీఎస్సీ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనకు ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు భూపతిరెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులు మద్దతు ప్రకటించారు.ఈ సమస్యను పరిష్కరించకపోతే దీక్ష చేస్తామని హెచ్చరించారు.