Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్మల్ జిల్లాకు చెందిన వడ్డెర వృత్తిదారుడు సాయన్న ప్రమాదవశాత్తు చనిపోయాడని వడ్డెర వృత్తిదారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విడగొట్టి సాయిలు, విగేష్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రవెంకటేశం, ఫెడరేషన్ ఎండీ మల్లయ్య భట్టు మంగళవారం సాయన్న కుటుంబానికి రూ. 50వేల చెక్కును అందజేసి ఆదుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వృత్తిదారుల సంఘం తరుపున సంక్షేమ శాఖ అధికారులకు ఈ నేపథ్యంలో వారు కృతజ్ఞతలు తెలిపారు.