Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకుల నోటిఫికేషన్ను వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12 వేల గురుకుల టీచర్ల పోస్టుల భర్తీ కోసం ఎనిమిది నెలల క్రితం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రోస్టర్ జాబితా పేరుతో గురుకుల బోర్డ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీంతో గురుకుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు.