Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత బదిలీల్లో ఉపాధ్యాయులు పనిచేసిన మొత్తం సర్వీస్‌కు ఎన్టైటిల్ పాయింట్లు ఉండేవనీ, వాటిని ప్రస్తుత మార్గదర్శకాల్లో చేర్చాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను ఆ సంఘం అధ్యక్షులు కావలి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ-2020 ప్రకారం కొన్ని గ్రామాలు, పట్టణాలలో విలీనమయ్యాయని తెలిపారు. దీంతో హెచ్ఆర్ఏ కేటగిరీ మూడు నుంచి రెండులోకి మారాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఎన్టైటిల్ పాయింట్లు పొందుపరిచేందుకు రెండురకాల దరఖాస్తులను రూపొందించాలని కోరారు.