Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎంఎస్టీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ల సంఘం (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావును మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె నగేష్ కలిసి వినతిపత్రం సమర్పించారు. పదేండ్లుగా ఒకే పాఠశాలలో పనిచేస్తూ మోడల్ స్కూల్ టీచర్లు కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసిక క్షోభకు గురువుతున్నారని తెలిపారు. కొత్త స్కూళ్లలో కొత్త ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.