Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫలానా దుస్తులే ధరించాలి..ఫలానా రీతిగానే మాట్లాడాలంటూ బెదిరించే అల్లరిమూకలను చూసి మహిళలు భయపడాల్సిన అవసరం లేదని అమ్మా యిలు, మహిళలకు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సూచిం చారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. వాటిని తట్టుకుని నిలబడుతున్న ప్రతి జర్నలిస్ట్ మనకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లోని మహిళా నాయకులతో స్నేహం చేయడా నికి తాను ఇష్టపడుతానని స్పష్టం చేశారు. మంగళ వారం హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా స్పియర్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళా జర్నలిస్టుల పై దాడులు, వేధింపులు పెరిగాయని తెలిపారు. వారిని టార్గెట్ చేయడం సులభంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భారతదేశంలోని అనేక మందిపై పెగాసస్ ఉపయోగించారని, అందు లో ఎక్కువ మంది మహిళా జర్నలిస్టులే ఉన్నారని తెలిపారు. పాకిస్తాన్ లాంటి దేశాల్లో మహిళా జర్నలిస్టులు వార్తలు రాస్తే కుటుంబ సభ్యులే పరువు హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. జర్నలిజం మహిళలకు అనుకున్నంత సులభమైన వృత్తి కాదనీ, అయితే చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రంగం ద్వారా అనేకమంది మహిళలకు సహాయ పడవచ్చుననీ వివరించారు. స్వార్థంతో కాకుండా, సమాజం కోసం చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేసినప్పుడే సవాళ్లను ఎదు ర్కోగలమని కవిత ఈ సందర్భంగా భరోసానిచ్చా రు. మహిళా జర్నలిస్టులు ప్రపంచంలోని వివిధ రకాల సంస్థలతో సంబంధాలు కలిగి ఉండాలని సూచిం చారు. ఈ ఏడాది నుండి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో అర్థికంగా వెనుకబడిన పది మంది విద్యార్థినిలకు భారత్ జాగృతి తరుపున 'కేసీఆర్ స్కాలర్షిప్' అందిస్తామని ప్రకటించారు. బతుకమ్మ, భారతదేశం, ఓటు హక్కు అనే అంశాలపై మూడు సినిమాలు రూపొందించాలని విద్యార్థినీలను కోరారు.
కవితతో పలు రాష్ట్రాల రైతు నేతల భేటి
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు , రైతు బీమా, ఉచిత కరెంట్ పథకాలు బాగున్నాయని పలు రాష్ట్రాల నేతలు కొనియాడారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు మంగళవారం కవితతో భేటీ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి వారు సంసిద్ధతను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశమంతా అమలు కావాలని ఆకాంక్షించారు.