Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ రవిచంద్ర
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మరిన్ని మొక్కల్ని నాటడం ద్వారా మనతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమస్ఫూర్తితో 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వద్దిరాజు..మంగళవారం హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటారు. మానవాళిని పట్టి పీడిస్తున్న భూతాపం, వాతావరణ కాలుష్యాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రముఖులు,అటవీ శాఖ సిబ్బంది ఎంపీ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.