Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ అధికారుల నిర్బంధం
నవతెలంగాణ-తాడ్వాయి
ఏసీడీ పేరుతో అధిక కరెంట్ బిల్లులు వేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపిస్తూ విద్యుత్ అధికారులను గ్రామస్తులు బంధించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి మంగళవారం విద్యుత్ అధికారులను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ఇష్టారీతిగా బిల్లులు వేస్తే ఎలా కట్టాలని ప్రశ్నించారు. ఏసీడీ బిల్లులపై ఉన్నతాధికారులు వచ్చి వివరణ ఇచ్చే వరకూ వదిలిపెట ్టబోమని స్పష్టంచేశారు. అనంతరం ఫోన్లో సముదాయించడంతో అధికారులను వదలిపెట్టారు. ఏసీడీ బిల్లులు కట్టబోమని, కట్టాలని ఒత్తిడి తీసుకురావొద్దని గ్రామస్తులు హెచ్చరించారు.