Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులం, మతం లేని పార్టీ వైఎస్ఆర్టీపీ
- వివేకానంద రెడ్డి హత్య కేసును సాగదీస్తున్నారు
- 28 నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పున: ప్రారంభం : విలేకర్ల సమావేశంలో వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నదనీ, అందుకు భిన్నంగా కుల మతాలకతీతంగా వైఎస్ఆర్టీపీ అందరినీ కలుపుకొస్తున్నదని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కుట్రల వల్ల ఆగిన పాదయాత్రను ఈ నెల 28నుంచి ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుంచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. కేసీఆర్‌కు రాజ్యాంగమన్నా, మహిళలన్నా గౌరవం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. మహిళా టీచర్లు స్పాజ్ బదిలీల కోసం చంటి బిడ్డలతో పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఖమ్మం కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాజకీయ పునాది వేసింది వైయస్ఆరేనని చెప్పారు. ఆయనకు ఆ కతజ్ఞత ఉండాలన్నారు. వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ ఒక్కరికే ఎందుకిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజాప్రస్థానం యాత్ర కేసీఆర్‌కు అంతిమ యాత్ర అవుతుందని హెచ్చరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అత్యంత దారుణమైందన్నారు. ఆ కేసు విచారణను ఇంకెంత కాలం సాగదీస్తారని వాపోయారు. రేవంత్‌రెడ్డి ముందస్తు ఎన్నికలంటూ తన ఉనికిని చాటుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పాలేరులోనే పోటీచేస్తానని ప్రకటించారు.
వైఎస్ షర్మిలతో పొంగులేటి భేటి..
భారత రాష్ట్ర సమితికి దూరమవుతున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సంర్భంగా తాజా రాజకీయ పరిణామాలను చర్చించినుట్టు తెలిసింది.